న్యూఢిల్లీ : ఓ వ్యక్తి తన పిల్లలను ప్రజల మధ్యలో డ్యాన్స్ చేసేందుకు ప్రోత్సహించారు. దీనికి సంబంధించిన క్లిప్‌ను సాధన అనే యూజర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఈ వీడియోను (viral video) ఏకంగా 90 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ క్లిప్‌లో ప్రణవ్ హెగ్డే అనే వ్యక్తితో సాధన డ్యాన్స్ చేస్తూ పార్క్‌లో రీల్‌ను రికార్డు చేస్తుండటం కనిపిస్తుంది. ఆపై ఓ వ్యక్తి వారి వద్దకు చేరుకుని వారితో తమ పిల్లలు డ్యాన్స్ చేయవచ్చా అని అడుగుతాడు.
అందుకు సాధన, ప్రణవ్ అంగీకరించినా పిల్లలు కొత్తవారి ముందు డ్యాన్స్ చేసేందుకు తొలుత నిరాకరిస్తారు. తండ్రి వారికి నచ్చచెప్పి ప్రోత్సహించడంతో పిల్లలు డ్యాన్స్ చేసేందుకు అంగీకరిస్తారు. తమ పిల్లలు డ్యాన్స్ చేస్తుండగా ఆ వ్యక్తి ప్రోత్సహించడం కనిపిస్తుంది. ఏదీ బెస్ట్ అని చెప్పలేం..మీకు తెలిసింది చేయడమే అని తండ్రి గట్టిగా చెబుతుండటం వినిపడుతుంది.
మేం డ్యాన్స్ చేస్తుండగా చిన్నారులు వారి తండ్రి ప్రోత్సాహంతో మాతో జత కలిశారు.. పిల్లలు పాజిటివ్ వైబ్స్‌ను పంచారు..పిల్లలతో మేం డ్యాన్స్ చేయగా వారి పేరెంట్స్ ముఖ్యంగా వారి తండ్రి ఎంతో ఆనందించారు..డబ్బు, విలాసవంత జీవితం అనుభవించడం కాదు..కొన్ని సార్లు చిన్నపాటి విషయాలనూ ఆస్వాదించడమే గొప్పవిషయమని గ్రహించా అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. పిల్లల్ని అందరి ఎదుటా డ్యాన్స్ చేసేందుకు ప్రోత్సహించిన తండ్రిని పలువురు నెటిజన్లు ప్రశంసించారు. సూపర్ డాడ్ అంటూ కామెంట్స్ సెక్షన్లో ప్రశంసలు గుప్పించారు.
Read More