కువైట్: కువైట్‌లో జరుగుతన్న టీ20 టోర్నీ(T20 League)లో.. ఓ బ్యాటర్ ఒక్క ఓవర్లోనే 46 రన్స్ చేశాడు. కేసీసీ ఫ్రెండ్స్ మొబైల్ టీ20 చాంపియన్స్ ట్రోఫీలో ఈ ఘటన జరిగింది. ఎన్సీఎం ఇన్వెస్ట్మెంట్, టాలీ సీసీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో .. ఎన్సీఎం బ్యాటర్ వాసు భారీ షాట్లతో అలరించాడు. హర్మన్ బౌలింగ్‌లో రెచ్చిపోయాడు. తొలి బంతిని హర్మన్ నోబాల్‌గా వేశాడు. ఆ బంతికి సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత నాలుగు బైస్ ఇచ్చాడు. ఇక తర్వాత అయిదు బంతుల్లోనూ అయిదు సిక్సర్లు కొట్టేశాడు. దాంట్లో ఒక నోబాల్ కూడా ఉంది. ఇక ఆ ఓవర్ చివరి బంతిని బ్యాటర్ వాసు బౌండరీకి తరలించాడు. దీంతో ఆ ఒక్క ఓవర్లోనే 46 రన్స్ వచ్చేశాయి. ఆ వీడియోను మీరూ చూడండి.
Getting 46 runs in an over is not possible right? Right? Wrong! Watch this absolute bonkers over now.
.
.#KCCT20 pic.twitter.com/PFRRivh0Ae— FanCode (@FanCode) May 3, 2023