Bhola Shankar | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం భోళా శంకర్ (Bhola Shankar) షూటింగ్‌తో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వేదాళమ్ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని మెహర్ రమేశ్ డైరెక్ట్ చేస్తున్నాడు. చిరంజీవి టీం నయా షెడ్యూల్లో భాగంగా ఇప్పటికే కోల్‌కతాలో ల్యాండ్ అయింది. యమహా నగరి వీధుల్లో భోళా శంకర్ షూటింగ్‌కు సంబంధించిన స్టిల్స్ ను ఏకే ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. తాజా న్యూస్ ప్రకారం భోళా శంకర్ షూటింగ్ విక్టోరియా మెమోరియల్‌లో కొనసాగుతోంది. మరోవైపు తమన్నా (Tamannah) లుక్ ఒకటి కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మరోవైపు తమన్నా లుక్ ఒకటి కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. చిరంజీవి నటించిన కోల్‌కతా బ్యాక్ డ్రాప్లో సాగే చూడాలని ఉంది చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిందని తెలిసిందే. భోళాశంకర్ కోసం చిరంజీవి మరోసారి ఇదే సిటీలో ఉండటంతో సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడం పక్కా అని చర్చించుకుంటున్నారు అభిమానులు, ఫాలోవర్లు. భోళాశంకర్ చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. భోళా శంకర్‌లో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్, వెన్నెల కిశోర్, పీ రవి శంకర్, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన పోస్టర్‌తో.. చిరంజీవి మరోసారి ఇందులో ట్యాక్సీ డ్రైవర్‌గా ఎంటర్టైన్ చేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. చిరంజీవి సోదరిగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్ నటిస్తోంది.హైదరాబాద్‌లో ఇప్పటికే భోళా శంకర్ యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే.
Bholaashankar2
Bholaashankar3
Bholaashankar4
The Swag of Mega🌟@Kchirutweets from the streets of Yamahanagari ❤️
& the sets of #BholaaShankar 🔱
Bholaa Shankar Vibe In Theatres on AUG 11th🤟🏻@MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @IamSushanthA @dudlyraj #MahathiSwaraSagar @prakash3933 @AdityaMusic pic.twitter.com/0n4ssRQWnP
— AK Entertainments (@AKentsOfficial) May 4, 2023