Health tips | వీటిని దూరం పెడితే రక్తం పలుచబడి ఆరోగ్యం మెరుగవుతుందట..!
Blood | ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా అనారోగ్యంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో ఎక్కువగా మనకు గుండె పోటు మరణాలు సంభవిస్తాయి. ఒకప్పుడు పెద్ద వయసు వారిలో మాత్రమే ఈ అనారోగ్యాలు కనిపించేవి. కానీ ఇప్పుడు చిన్న వయసు వారికి కూడా హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
Health tips : ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా అనారోగ్యంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో ఎక్కువగా మనకు గుండె పోటు మరణాలు సంభవిస్తాయి. ఒకప్పుడు పెద్ద వయసు వారిలో మాత్రమే ఈ అనారోగ్యాలు కనిపించేవి. కానీ ఇప్పుడు చిన్న వయసు వారికి కూడా హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా గుండె జబ్బులు రావద్దంటే రక్తం పలుచగా ఉండేలా చూసుకోవాలి. రక్తం పలుచగా ఉంటేనే గుండెకు పంపింగ్ సులభమవుతుంది. అందుకే రక్తాన్ని పలుచగా చేసుకునేందుకు రకరకాల మెడిసిన్స్ వాడుతున్నారు. ఒకసారి గుండె జబ్బులు, అధిక రక్తపోటు లాంటివి వస్తే మాత్రం ఈ మెడిసిన్స్ జీవితకాలం వాడాల్సిందే. లేదంటే లైఫ్ స్టైల్‌ను పూర్తిగా ఛేంజ్ చేసుకోవాలి.
చాలామంది ఉప్పు, నూనె, నెయ్యి లాంటివి ఎక్కువగా తింటున్నారు. ఇలాంటి వాటి వల్లనే రక్తం చిక్కగా మారుతుంది. ఒకసారి రక్తం చిక్కగా మారితే దాన్ని పలుచగా చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి రక్తం చిక్కబడక ముందే లైఫ్ స్టైల్‌ను మార్చుకోవాలి. ఎక్కువ ఆయిల్ లేకుండా, ఎక్కువ ఉప్పు లేకుండా ఆహారం తీసుకుంటే చాలా మంచిది. ఉదయం, సాయంత్రం తక్కువగా ఉడికిన ఫుడ్ తీసుకోవాలి.
మధ్యాహ్నం సమయంలో మాత్రం ఉడికిన ఫుడ్ తింటే బెటర్. అంతే కాకుండా అందులో ఉప్పు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ వేసుకున్నా కూడా మోతాదు కంటే తక్కువ ఉంటేనే మంచిది. బయటి ఫుడ్స్ పూర్తిగా మానేయాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఆయిల్ ఎక్కువగా ఉండేవి అస్సలు తినొద్దు. అలాంటి లైఫ్‌స్టైల్‌ను ఫాలో అయితే నెలా, రెండు నెలల తర్వాత మెడిసిన్ మానిసేనా ఇబ్బందిలేని స్థాయిలో ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

