Irfan Pathan | ఇంగ్లండ్ క్రికెటర్లు ఐపీఎల్ నుంచి మధ్యలోనే నిష్క్రమిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఆ దేశ బోర్డు క్రికెటర్లను వెనక్కి పిలిచింది. మెగా టోర్నీ నుంచి ఆటగాళ్లు అర్ధాంతరంగా వెళ్లిపోతుండడంపై ఇప్పటికే సునీల్ గవాస్కర్ విమర్శలు గుప్పించారు. తాజాగా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ సైతం సోషల్ మీడియా వేదికగా మండిపడ్డాడు. టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో శిక్షణ కోసం ఇంగ్లండ్ బోర్డు తమ దేశ క్రికెటర్లను వెనక్కి పిలువడంతో.. వరల్డ్ కప్‌కు ఎంపికైన ఆటగాళ్లు జాస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), ఫిల్ సాల్ట్ (కోల్‌కతా నైట్ రైడర్స్), విల్ జాక్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), సామ్ కర్రాన్ (పంజాబ్ కింగ్స్) ఇంగ్లండ్‌కు బయలుదేరారు. ఆయా జట్లు ప్లే ఆఫ్ రేసులో కీలకమైన మ్యాచులున్నాయి.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు జట్లను వీడి వెళుండడంపై ఇర్ఫాన్ పఠాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లు ఉంటే పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉండాలని.. లేకపోతే అసలు రావొద్దన్నాడు. గత రాత్రి రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగ్గా ఇంగ్లండ్‌కు చెందిన రాజస్థాన్ స్టార్ ప్లేయర్ జాస్ బట్లర్ అందుబాటు లేకుండాపోయాడు. స్వదేశానికి బయలుదేరి వెళ్లాడు. సామ్ కర్రాన్ పంజాబ్ కింగ్స్ ఇవాళ స్వదేశానికి బయలుదేరనున్నాడు. ఈ క్రమంలో ఇర్ఫాన్ పఠాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. వీరితో పాటు జానీ బెయిర్‌స్టో, ఫిల్ స్టాల్ సైతం స్వదేశానికి వెళ్లనున్నారు. ఇటీవల సునీల్ గవాస్కర్ సైతం టోర్నీ నుంచి ముందుగానే వెళ్లిపోయే ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తి సీజన్‌కు అందుబాటులో లేని ఆటగాళ్లకు జరిమానా విధించాలని, బోర్డులకు సైతం కమిషన్ ఇవ్వొద్దని పిలుపునిచ్చారు.