Kevvu Karthik | ప్రముఖ టీవీ షో ‘జబర్దస్త్’ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కమెడియన్ కార్తీక్ తల్లి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆమె గత ఐదేండ్ల నుంచి క్యాన్సర్తో పోరాడుతోందన్నారు. ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం కన్నుమూసినట్లు కార్తీక్ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. తన తల్లి జీవితమంతా పోరాటమేనని, ఐదేళ్లుగా క్యాన్సర్తోనూ పోరాడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని తమను పెంచి పెద్ద చేసిందని చెప్పుకొచ్చాడు.
ఇన్నేళ్లు కష్టాల్లో తోడుగా నిలిచిన తల్లి.. తనను ఒంటరిగా వదిలేసి వెళ్లిందని వాపోయాడు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా భయపడకుండా ఆత్మస్థైర్యంతో ఎదుర్కొన్న తల్లి తనలో ధైర్యాన్ని నింపిందని.. సమాజంలో ఎలా బతకాలో నేర్పించిందని.. ఆమె లేకుండా తామెలా బతకాలో మాత్రం నేర్పించలేదని వాపోయాడు. తన తల్లిని బ్రతికించేందుకు ఐదేళ్ల పాటు సేవలందించిన వైద్యులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నానని కార్తీక్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. కెవ్వు కార్తీక్ మొదట మిమిక్రితో కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత జబర్దస్త్తో కమెడియన్గా మంచి గుర్తింపును సాధించాడు. ఓ వైపు కమెడియన్గా నటిస్తూనే పలు టీవీషోల్లోనూ అలరిస్తూ వస్తున్నాడు.