Watch: కారు ముందు అద్దంపై ట్రాఫిక్ పోలీస్.. పది కిలోమీటర్లు డ్రైవ్ చేసిన వ్యక్తి
Viral Video | ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ సిద్ధేశ్వర్ మాలి ఒక రోడ్డు కూడలి వద్ద విధులు నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు అనుమానాస్పదంగా కనిపించిన ఒక కారును ఆపేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే డ్రైవర్ కారును నిలుపలేదు.
ముంబై: ఒక ట్రాఫిక్ పోలీస్ కారు ముందు అద్దంపై ప్రమాదకరంగా వేలాడాడు. అయినప్పటికీ కారును నిలుపని డ్రైవర్ దానిని పది కిలోమీటర్ల వరకు నడిపాడు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయ్యింది. మహారాష్ట్రలోని వాషిలో ఈ సంఘటన జరిగింది. ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ సిద్ధేశ్వర్ మాలి ఒక రోడ్డు కూడలి వద్ద విధులు నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు అనుమానాస్పదంగా కనిపించిన ఒక కారును ఆపేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే డ్రైవర్ కారును నిలుపలేదు. దీంతో ట్రాఫిక్ పోలీస్ సిద్ధేశ్వర్ తన బైక్‌తో కారును వెంబడించారు. ఒక జంక్షన్ వద్ద బైక్ దిగి కారు ముందుకు వచ్చి ఆపేందుకు ప్రయత్నించారు.
కాగా, డ్రైవర్ ఆ కారును నిలుపలేదు. పైగా కారును వేగంగా డ్రైవ్ చేశాడు. దీంతో కారు ముందున్న ట్రాఫిక్ పోలీస్ సిద్ధేశ్వర్ దానిపైకి జంప్ చేశారు. కారు ముందున్న అద్దం భాగాన్ని గట్టిగా పట్టుకుని వేలాడారు. అయినప్పటికీ ఆ డ్రైవర్ కారును ఆపలేదు. కారు ముందు అద్దం వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రమాదకరంగా వేలాడుతున్నప్పటికీ పది కిలోమీటర్ల దూరం వరకు డ్రైవ్ చేశాడు. రద్దీగా ఉన్న ప్రధాన రహదారిపై కూడా కారును అలాగే నడిపాడు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పలు వాహనాల్లో ఆ కారును వెంబడించారు. చివరకు గవాన్ ఫాటా సమీపంలోని ఉరాన్ నాకా వద్ద పోలీస్ వాహనంతో ఆ కారును అడ్డుకున్నారు. కారు డ్రైవర్ ఆదిత్య బెంబాడేను అరెస్ట్ చేశారు. అతడు డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతుండటంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు.
Watch: High On Drugs, Man Drags Traffic Cop On Car's Windshield For 10 km In Maharashtra
Read here: https://t.co/1vEbl6k80l pic.twitter.com/WDtVzq6gc5
— NDTV Videos (@ndtvvideos) April 16, 2023
Also Read:
Shivaji’s Sword | శివాజీ ఖడ్గాన్ని బ్రిటన్ నుంచి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తా: మహారాష్ట్ర మంత్రి
Fake Software | తత్కాల్ రైలు టిక్కెట్ల బుకింగ్‌కు నకిలీ సాఫ్ట్వేర్ సృష్టి.. యూపీ వ్యక్తి అరెస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- car
- Drags
- Maharashtra
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

