Shivaji’s Sword | శివాజీ ఖడ్గాన్ని బ్రిటన్ నుంచి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తా: మహారాష్ట్ర మంత్రి
Shivaji's Sword | మరాఠా యోధుడు చత్రపతి శివాజీ వాడిన ఖడ్గాన్ని (Shivaji's Sword) బ్రిటన్ నుంచి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు. దీని కోసం వచ్చే నెలలో బ్రిటన్ వెళ్తున్నట్లు ఆయన చెప్పారు.
ముంబై: మరాఠా యోధుడు చత్రపతి శివాజీ వాడిన ఖడ్గాన్ని (Shivaji’s Sword) బ్రిటన్ నుంచి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు. దీని కోసం వచ్చే నెలలో బ్రిటన్ వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉపయోగించిన కత్తి, బాకును తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. ఆదివారం రాయ్‌గఢ్ జిల్లాలోని ఖర్ఘర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరైన కార్యక్రమంలో ముంగంటివార్ మాట్లాడారు. శివాజీ మహారాజ్ పట్టాభిషేకం 350వ వార్షికోత్సవాన్ని త్వరలో ఘనంగా జరుపుకుంటామని అన్నారు.
కాగా, మరాఠీ ప్రజల వీక్షణ కోసం ‘జగదాంబ’ ఖడ్గం, ‘వాఘ్-నఖ్’ (పులి గోళ్లలా కనిపించే బాకు)ను అందుబాటులో ఉంచాలని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ అలాన్ గెమ్మెల్, రాజకీయ, ద్వైపాక్షిక వ్యవహారాల డిప్యూటీ హెడ్ ఇమోజెన్ స్టోన్‌తో చర్చించినట్లు మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు. ‘నేను మే మొదటి వారంలో బ్రిటన్‌కు వెళ్తున్నాను. శివాజీ మహారాజ్ పట్టాభిషేకం 350 వ వార్షికోత్సవం కోసం ఆయన వినియోగించిన ఖడ్గం, బాకును మహారాష్ట్రకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను’ అని వెల్లడించారు.
Also Read:
Power consumption | 2022-23లో విద్యుత్ వినియోగం 9.5 శాతం వృద్ధి
Fake Software | తత్కాల్ రైలు టిక్కెట్ల బుకింగ్‌కు నకిలీ సాఫ్ట్వేర్ సృష్టి.. యూపీ వ్యక్తి అరెస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

