Power consumption | 2022-23లో విద్యుత్ వినియోగం 9.5 శాతం వృద్ధి
Power Consumption | 2023-24లో విద్యుత్ వినియోగం, డిమాండ్ గణనీయంగా మెరుగుపడుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ వేసవిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 229 గిగావాట్లకు చేరుతుందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.
న్యూఢిల్లీ: 2022-23లో దేశ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం (Power consumption) 9.5 శాతం వృద్ధి చెందింది. మొత్తం విద్యుత్ వినియోగం 1,503.65 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. కరోనా అనంతరం దేశంలో ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడటం వల్ల విద్యుత్ డిమాండ్ పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తున్నది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) విద్యుత్ సరఫరా డేటా ప్రకారం, 2021-22లో విద్యుత్ వినియోగం 1,374.02 బిలియన్ యూనిట్లుగా (బీయూ) ఉంది. గరిష్ట విద్యుత్ డిమాండ్ లేదా ఒక రోజులో అత్యధిక సరఫరా కూడా 207.23 గిగా వాట్ల (GW)కు పెరిగింది. 2021-22లో నమోదైన 200.53 గిగా వాట్ల (GW) కంటే కూడా ఇది ఎక్కువ.
కాగా, 2023-24లో విద్యుత్ వినియోగం, డిమాండ్ గణనీయంగా మెరుగుపడుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ వేసవిలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 229 గిగావాట్లకు చేరుతుందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో నడిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ఆ మేరకు బొగ్గును దిగుమతి చేసుకోవాలని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు బ్లెండింగ్ కోసం బొగ్గును దిగుమతి చేసుకోవాలని దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు సూచించింది.
మరోవైపు ఈ ఏడాది మార్చిలో దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో విద్యుత్ వినియోగంపై వర్షాల ప్రభావం పడింది. గతంతో పోల్చితే ఈ ఏడాది మార్చిలో విద్యుత్ వినియోగం 128.47 బిలియన్ యూనిట్లు (బీయూ) నుంచి 126.21 బిలియన్ యూనిట్లకు పడిపోయింది. అయితే 2022 ఏప్రిల్ నుంచి 2023 ఫిబ్రవరి వరకు విద్యుత్ వినియోగం 1,377.43 బిలియన్ యూనిట్లు (బీయూ). 2021-22 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 1,374.02 బిలియన్ యూనిట్ల (బీయూ) కంటే ఇది ఎక్కువ.
కాగా, ఈ ఏడాది మార్చిలో వర్షాలు లేకపోతే విద్యుత్ వినియోగం గత ఆర్థిక సంవత్సరం కంటే మరింతగా పెరిగేదని విద్యుత్ రంగ నిఫుణులు తెలిపారు. 2023-24లో విద్యుత్ వినియోగం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేశారు. విద్యుత్ వినియోగం పెరుగడం వల్ల దేశంలో ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడుతున్నాయని అభిప్రాయపడ్డారు. తద్వారా విద్యుత్‌కు డిమాండ్ ఏర్పడుతుందని విద్యుత్ రంగ నిఫుణులు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

