భార్య గొంతెమ్మ కోరికలు తీర్చడం కోసం చైన్ స్నాచర్‌గా మారిన భర్త..!
Chain snacher in Mumbai: వారికి కొత్తగా పెళ్లైంది. భార్యాభర్తలు బాగా కలిసిపోయారు. ఇదే క్రమంలో భార్య తన మనసులోని చిన్నచిన్న కోరికలను భర్తతో పంచుకోవడం భర్త వాటిని తీర్చుకుంటూ పోవడం జరుగుతున్నది.

ముంబై: వారికి కొత్తగా పెళ్లైంది. భార్యాభర్తలు బాగా కలిసిపోయారు. ఇదే క్రమంలో భార్య తన మనసులోని చిన్నచిన్న కోరికలను భర్తతో పంచుకోవడం భర్త వాటిని తీర్చుకుంటూ పోవడం జరుగుతున్నది. భార్య ఏం కోరితే అది తెచ్చి ముందు పెడుతున్నాడు. ఇక మెల్లగా భార్య పెద్దపెద్ద కోరికలు కోరడం మొదలుపెట్టింది. కానీ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేసే భర్త ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అయినా మనోడు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. భార్య గొంతెమ్మ కోరికలు తీర్చడం కోసం ఏకంగా చైన్ స్నాచర్ అవతారం ఎత్తాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. మహారాష్ట్రలోని పుణెలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పుణెలోని వాకడ్ ప్రాంతానికి యాదవ్ అనే వ్యక్తి గురించి మనం ఇప్పటివరకు చెప్పుకున్నది. భార్య కోరికలు తీర్చడానికి తన సంపాదన సరిపోదని భావించిన యాదవ్.. చైన్ స్నాచింగ్‌తో బాగా డబ్బు సంపాదించవచ్చని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఇంటర్నెట్లో చైన్ స్నాచింగ్‌కు సంబంధించిన వీడియోలను బాగా పరిశీలించాడు. ఆ తర్వాత కార్య రంగంలోకి దిగాడు. రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకుని స్నాచింగ్‌లు మొదలుపెట్టాడు.
మొత్తం ఏడు ప్రాంతాల్లో స్నాచింగ్‌లకు పాల్పడి 121 గ్రాముల బంగారం దొంగిలించాడు. మరో రెండు బైకులను కూడా తస్కరించాడు. ఈ క్రమంలో ఆదివారం పుణెలోని వాకడే ప్రాంతాన్ని తన టార్గెట్‌గా ఎంచుకుని రెక్కి నిర్వహించసాగాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు యాదవ్ కదలికలు అనుమానాస్పదంగా అనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో యాదవ్ అసలు విషయం ఒప్పుకున్నాడు. దాంతో అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఇవి కూడా చదవండి..
ఆ టాయిలెట్స్ వినియోగిస్తే మనకే డబ్బులిస్తారట..!
లేహ్ ఆందాల వీక్షణకు పోటెత్తిన టూరిస్టులు..!
ఇంట్లో దూరి 21 పిల్లలు చేసిన నాగుపాము..!
ముక్కులో చెక్కపుల్లలు.. వారమైనా గుర్తించలేకపోయిన మహిళ..!
అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టిన వృద్ధుడు.. వైరల్ వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

