ముక్కులో చెక్కపుల్లలు.. వారమైనా గుర్తించలేకపోయిన మహిళ..!
Chopsticks in Woman nose: తైవాన్‌లో ఓ 29 ఏండ్ల మహిళ ముక్కులో ఏకంగా రెండు చాప్‌స్టిక్స్ (ఆహారాన్ని గుచ్చి తినడానికి ఉపయోగించే చెక్క పుల్లలు) గుచ్చుకున్నా ఆమె వారం రోజుల దాకా గుర్తించలేకపోయింది.

తైవాన్: సాధారణంగా ముక్కులో చిన్న కురుపైనా ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. అది పూర్తిగా తగ్గిపోయే వరకు ఒక రకమైన యాతనను అనుభవించాల్సి వస్తుంది. కానీ తైవాన్‌లో ఓ 29 ఏండ్ల మహిళ ముక్కులో ఏకంగా రెండు చాప్‌స్టిక్స్ (ఆహారాన్ని గుచ్చి తినడానికి ఉపయోగించే చెక్క పుల్లలు) గుచ్చుకున్నా ఆమె వారం రోజుల దాకా గుర్తించలేకపోయింది. వివరాల్లోకి వెళ్తే.. తైవాన్‌లో సదరు మహిళకు, ఆమె సోదరికి రాత్రి డిన్నర్ చేసే సమయంలో గొడవ జరిగింది.
ఇద్దరి మధ్య మాటామాటా పెరుగడంతో చివరికి కొట్టుకునే దాకా వెళ్లింది. తినే ప్లేట్లు, గిన్నెలతోనే ఒకరినొకరు కొట్టుకున్నారు. దాంతో బాధిత మహిళ ముక్కుపై వంటపాత్రల ముక్కలు గుచ్చుకుని స్వల్పంగా రక్తస్రావం అయ్యింది. దాంతో ఆమె ఆస్పత్రికి వెళ్లగా.. వైద్యులు ఎక్స్‌రేలు తీసి చిన్నచిన్న ఇనుప ముక్కలు, చెక్క ముక్కలు తొలగించి పంపించారు. వారం రోజుల తర్వాత ముక్కుపై గాయాలు పూర్తిగా మానిపోయాయి.
ఆ తర్వాత బాధితురాలు గొడవ జరిగిన రోజు విరిగిపోయిన వస్తువులను పరిశీలించగా చాప్స్టిక్స్లో కొన్ని భాగాలు విరిగిపోయి ఉన్నాయి. అవి ఏమై ఉంటాయనే అనుమానంతో అద్దంలో ముఖం చూసుకోగా తన ముక్కులో గ్రే రంగులో ఏదో వస్తువు ఉన్నట్లు కనిపించింది. దాంతో ఆమె వెంటనే ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు స్కానింగ్ చేసి మహిళ సైనస్లో రెండు చాప్‌స్టిక్ పీసులు ఉన్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స చేసి 1.4 ఇంచులు, 2 ఇంచులు పొడవు ఉన్న రెండు చాప్‌స్టిక్ ముక్కలను తొలగించారు.
అయితే, వారం రోజులపాటు చాప్‌స్టిక్ ముక్కలు తన ముక్కులో ఉన్నా మహిళకు నొప్పి తెలియకపోవడంపై వైద్యుల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సైనస్లో చాప్‌స్టిక్స్ ఉన్నా ఎందుకు నొప్పి తెలియలేదో తెలుసుకునేందుకు అధ్యయనం చేశారు. ఆ కేస్ స్టడీని జూన్ 24న ఎమర్జెన్సీ మెడిసిన్ అనే జర్నల్‌లో ప్రచురించారు.
ఇవి కూడా చదవండి..
అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టిన వృద్ధుడు.. వైరల్ వీడియో
‘గిన్నిస్’కు ఎక్కిన గుర్రం బిగ్ జాక్ మృతి..!
వరుడికి కట్నంగా ఆక్సిజన్..!
ఇంటర్నెట్ తెచ్చిన తంటా.. చెట్టుపై నుంచి ఉపాధ్యాయుడి బోధన..!
చేపల కోసం వల వేస్తే కొండచిలువ చిక్కింది..!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

