Mamata Banerjee | పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆసుపత్రిపాలైన విషయం తెలిసిందే. 69 ఏండ్ల దీదీ గురువారం సాయంత్రం తన ఇంట్లో పడిపోవడంతో ఆమె నుదుటిపై పెద్ద గాయం అయ్యింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సీఎం ఆరోగ్య పరిస్థితి నిలకడగా (Condition Stable) ఉన్నట్లు రాష్ట్ర పరిపాలన సీనియర్ అధికారి శుక్రవారం తెలిపారు.
‘సీఎం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సీనియర్ వైద్యులు ఆమెను నిశితంగా గమనిస్తున్నారు. రాత్రి కూడా ఆమె బాగానే నిద్రపోయారు’ అని సదరు అధికారి మీడియాకు వెల్లడించారు. నుదుటిపై మూడు కుట్లు, ముక్కుపై ఒక కుట్టు వేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలో అవసరమైన వైద్య పరీక్షల అనంతరం డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు.
దీదీ గురువారం సాయంత్రం ఒక కార్యక్రమానికి హాజరై తన ఇంటికి వచ్చారు. ఇంట్లో పడిపోవటంతో ఆమె నుదుటిపై పెద్ద గాయం అయ్యిందని, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వెంటనే దవాఖానకు తరలించిన ట్టు టీఎంసీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రక్తం వస్తున్న ఫొటోలను పోస్ట్ చేశారు. దీదీ ప్రస్తుతం కోల్‌కతాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also Read..
Election Commissioners | ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన సుఖ్బీర్, జ్ఞానేశ్
Earthquaken | జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టరు స్కేలుపై 5.8 తీవ్రతతో బలమైన ప్రకంపనలు
IPL 2024 | ఐపీఎల్‌కు స్టార్ పేసర్ దూరం.. ఢిల్లీ కొత్త అస్త్రం అతడేనా..?