కోల్‌కతా : ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్ అతిఖ్ అహ్మద్ అతడి సోదరుడు ఆష్రఫ్‌లను దుండగులు కాల్చిచంపిన అనంతరం యూపీ ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) విమర్శలు గుప్పించారు. యూపీలో అరాచకం ప్రబలిపోయిందని, ఈ ఘటనతో రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవస్ధ కుప్పకూలిందని దీదీ ఆందోళన వ్యక్తం చేశారు.
రాజ్యాంగ నిబంధనలతో నడిచే మన ప్రజాస్వామిక వ్యవస్ధలో ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలకు చోటు లేదని, యూపీలో అరాచక ఘటనలతో శాంతి భద్రతల వ్యవస్ధ కుప్పకూలడం చూసి తాను దిగ్భ్రాంతికి లోనయ్యానని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. యూపీలో ప్రస్తుతం నేరస్తులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పోలీసులు, మీడియా ఎదుటే చెలరేగుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా ఉమేశ్‌పాల్ హత్యకేసు నిందితుడు, గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ హత్య నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh) ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ (144 section) విధించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. గ్యాంగ్‌స్టర్ అతీ అహ్మద్ (gangster-politician Atiq Ahmed), అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌ను (Ashraf Ahmed) శనివారం రాత్రి 10 గంటల సమయంలో వైద్యపరీక్షల నిమిత్తం ప్రయాగ్‌రాజ్‌లోని మెడికల్ కాలీజీకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో జర్నలిస్టుల్లా వచ్చిన ముగ్గురు వ్యక్తులు వారిపై అతి దగ్గర నుంచి కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
Read More
Jagadish Shettar | కర్ణాటకలో బీజేపీకి షాక్.. మాజీ సీఎం రాజీనామా