Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో పాలక ఎన్డీయేకు విపక్ష ఇండియా కూటమి దీటైన పోటీ ఇవ్వడంతో తదుపరి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇరు కూటముల్లో తర్జనభర్జనలు సాగుతున్నాయి. ఈసారి 400 స్ధానాలు పైగా వస్తాయని ఊదరగొట్టిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు దూరంలో నిలిచిపోవడంతో మిత్రుల తోడ్పాటు తప్పనిసరైంది.
ఎన్డీయే కూటమి విపక్షాలపై స్వల్ప ఆధిక్యతను కనబరుస్తోంది. ప్రధాని మెజారిటీ మార్క్ పొందకపోవడం పట్ల తాను సంతోషంగా ఉన్నానని టీఎంసీ అధినేత్రి, పశ్చి మ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ప్రధాని ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని ఆమె స్పష్టం చేశారు.
ఈసారి తాము 400కుపైగా స్ధానాలు సాధిస్తామని మోదీ పదేపదే చెప్పారని గుర్తుచేసిన దీదీ ఇక ప్రధాని పదవి నుంచి ఆయన వైదొలగాలని డిమాండ్ చేశారు. ఇక బెంగాల్లో బీజేపీపై టీఎంసీ పూర్తి ఆధిక్యం కనబరించింది.
రాష్ట్రంలో మొత్తం 42 లోక్‌సభ స్ధానాలకు గాను టీఎంసీ 29 స్దానాల్లో ఆధిక్యం కనబరచగా, బీజేపీ కేవలం 12 స్దానాల్లో ముందంజలో ఉంది. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ 18 స్ధానాల్లో విజయం సాధించింది.
Read More :
Amritpal Singh | ముందంజలో ఖలిస్థానీ నేత అమృత్‌పాల్ సింగ్