Amritpal Singh | ముందంజలో ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్
Amritpal Singh | జైలు శిక్ష అనుభవిస్తున్న ‘వారిస్ పంజాబ్ దే’ అతివాద సంస్థ అధిపతి అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) ముందంజలో ఉన్నారు.
Amritpal Singh | దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మేజిక్ ఫిగర్ దాటి ముందంజలో కొనసాగుతోంది. అదే సమయంలో ప్రతిపక్ష ఇండియా కూటమి సైతం 200 సీట్లకుపైగా ఆధిక్యంలో దూసుకెళ్తోంది.
ఇక ఈ ఎన్నికల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ‘వారిస్ పంజాబ్ దే’ అతివాద సంస్థ అధిపతి అమృత్పాల్ సింగ్ (Amritpal Singh) ముందంజలో ఉన్నారు. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై అస్సాంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉన్న ఆయన ఈ ఎన్నికల్లో పంజాబ్ (Punjab)లోని ఖడూర్ సాహిబ్ నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆతను కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరాపై 45,424 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
అమృత్సర్ జిల్లా అజ్నాలా పోలీసులపై దాడి కేసులో అమృత్పాల్ పేరు దేశంలో మార్మోగింది. అతడు చాలాకాలం దుబాయ్లో ఉన్నాడు. ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ వ్యవస్థాపకుడు దీప్ సిద్ధూ మరణంతో అమృత్పాల్ ఆ సంస్థకు తానే నాయకుడినని ప్రకటించుకున్నాడు. నాటి నుంచి ఖలిస్థానీ కార్యకలాపాలకు ఏకంగా పంజాబ్నే స్థావరంగా ఎంచుకున్నాడు. అజ్నాలా ఘటన తర్వాత దాదాపు నెల రోజులు అజ్ఞాతంలో గడిపాడు. చివరికి గురుద్వారాలో అతడిని అరెస్ట్ చేసి దిబ్రూగఢ్ జైలుకు తరలించారు.
Also Read..
Odisha Assembly: బీజేడీకి బ్రేకేసిన బీజేపీ !
RJD | బీహార్లో ఆర్జేడీకి ఎదురుదెబ్బ.. తిరుగులేని ఆధిక్యంలో ఎన్డీఏ కూటమి
Kodali Nani | గుడివాడలో కొడాలి నాని వెనుకంజ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

