న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సీనియర్ నేత సుదీప్ బందోపాధ్యాయ శనివారం కేంద్రమంత్రులు అమిత్ షా, భూపేంద్ర సింగ్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టీఎంసీ తిరుగుబాటు ఎంపీ శతాబ్ది రాయ్ కూడా పాల్గొన్నారు. సింగ్తో బందోపాధ్యాయ భేటీ కావడంపై టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష స్పందిస్తూ, ఆయనకు పార్టీ మారే చరిత్ర ఉన్నదని విమర్శించారు.
ఆయన మంచివాడు కాదని, మమతను తప్పు దోవ పట్టించడం ద్వారానే అతని రాజకీయం నడిచిందని గతంలోనే చెప్పామన్నారు. మరోవైపు మాజీ రాష్ట్ర మంత్రి మనస్ భునియా శనివారం టీఎంసీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. కాగా టీఎంసీ తిరుగుబాటు ఎంపీలంతా లోక్సభ స్పీకర్ను కలిసే ముందు ఆదివారం పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు తో సమావేశం కానున్నారు.