చెన్నై: ప్రధాని మోదీ ఓ ఉగ్రవాది అని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ప్రత్యర్థులను బెదిరించి, భయపెడతారని.. ఆ అర్థంలోనే ఆ పదం వాడానని తన వాఖ్యలపై వివరణ ఇచ్చారు. సోమవారం చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీజేపీతో ఏఐఏడీఎంకే పొత్తు పెట్టుకోవడం గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్లు ఎలా మోదీతో కలుస్తారు? ఆయనొక ఉగ్రవాది. ఆయనకు సమానత్వంపై నమ్మకం లేదు. ఆయన పార్టీ సమానత్వాన్ని, న్యాయాన్ని నమ్మదు. వీళ్లు వెళ్లి వాళ్లతో కలుస్తున్నారు. దానర్థం ప్రజాస్వామ్యాన్ని వాళ్లు బలహీనపరుస్తున్నారనే’ అని ఖర్గే ధ్వజమెత్తారు.