న్యూఢిల్లీ : నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెకు ముందు రాష్ట్రపతిగా వ్యవహరించిన రామ్‌నాథ్ కోవింద్‌లను ఆహ్వానించలేదని ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్ధలను అగౌరవపరుస్తోందని, రాష్ట్రపతి కార్యాలయాన్ని లాంఛనప్రాయం చేసిందని అన్నారు.
It looks like the Modi Govt has ensured election of President of India from the Dalit and the Tribal communities only for electoral reasons.
While Former President, Shri Kovind was not invited for the New Parliament foundation laying ceremony…
1/4
— Mallikarjun Kharge (@kharge) May 22, 2023
ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 28న నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తారని లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపింది. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే మోదీ ప్రభుత్వం దళిత, గిరిజన వర్గాల నుంచి రాష్ట్రపతులను ఎన్నికయ్యేలా చూసినట్టు కనిపిస్తోందని ఖర్గే దుయ్యబట్టారు. పార్లమెంట్ దేశ అత్యున్నత శాసనవ్యవస్ధని, రాష్ట్రపతి ప్రభుత్వంతో పాటు విపక్షం, దేశ పౌరులందరి ప్రతినిధి అని ఖర్గే ట్వీట్ చేశారు.
The Modi Govt has repeatedly disrespected propriety.
The Office of the President of India is reduced to tokenism under the BJP-RSS Government.
4/4
— Mallikarjun Kharge (@kharge) May 22, 2023
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశప్రజలందరికీ ప్రతినిధి అని, ఆమె దేశ తొలి పౌరురాలని ట్విట్టర్ వేదికగా ఆయన వ్యాఖ్యానించారు. నూతన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభిస్తే ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ వ్యవస్ధలకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సంకేతాలు పంపవచ్చని ఖర్గే పేర్కొన్నారు.
Read More