Maharashtra | ముంబై, సెప్టెంబర్ 5: పదేండ్ల లోపు ఇద్దరు మగ పిల్లలు. అనారోగ్యంతో దవాఖానలో చనిపోగా.. పుట్టెడు శోకంలో ఉన్న ఆ పిల్లల తల్లిదండ్రుల గోడు పట్టించుకునే నాథుడే లేడు. దవాఖాన సిబ్బంది కనీసం అంబులెన్స్ కూడా ఏర్పాటుచేయకపోవటంతో, పిల్లల మృతదేహాల్ని వారి తల్లిదండ్రులు భుజాలపై మోసుకెళ్లారు. గడ్చిరోలి నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని పట్టిగావో గ్రామానికి వారు నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇంచార్జ్ మంత్రిగా ఉన్న గడ్చిరోలిలో ఈ ఘటన చోటుచేసుకుందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.