Maharashtra minister | 30 ఏండ్ల కిందటి మోసం కేసు (fraud case)లో మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి (Maharashtra minister) మాణిక్‌రావ్ కొకటే (Manikrao Kokate) దోషిగా తేలారు. దీంతో నాసిక్ జిల్లా కోర్టు (Nashik district court) మంత్రికి రెండేండ్లు జైలు శిక్ష విధించింది. అంతేకాదు రూ.50 వేల జరిమానా కూడా వేసింది. మంత్రితోపాటు ఆయన సోదరుడు సునీల్ కొకటేని కూడా కోర్టు దోషిగా తేల్చింది.
కాగా, నిర్మాణ్ వ్యూ అపార్ట్మెంట్ (Nirman View Apartment)లో ముఖ్యమంత్రి కోటా కింద కొకాటే సోదరులు రెండు ఫ్లాట్లను పొందారనే ఆరోపణలు ఉన్నాయి. డాక్యుమెంట్ ట్యాంపరింగ్ చేసి ఆ ఫ్లాట్స్‌ను దక్కించుకున్నారని, ప్రయోజనాలను చట్టవిరుద్ధంగా పొందేందుకు నకిలీ పత్రాలను సృష్టించారని ఆరోపిస్తూ మాజీ మంత్రి తుకారాం డిఘోలే 1995లో కొకాటే సోదరులపై కేసు పెట్టారు. దీనిపై విచారణ జరిపిన నాసిక్ జిల్లా సెషన్స్ కోర్టు కొకాటే సోదరులను దోషిగా తేల్చింది. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది. అయితే, శిక్ష పడిన వెంటనే ఆయనకు బెయిల్ మంజూరైంది. కోర్టు ఉత్తర్వులపై అప్పీల్‌కు వెళ్లనున్నట్లు మంత్రి విలేకరులతో తెలిపారు.
Also Read..
Eknath Shinde | ఏక్నాథ్ షిండేకి హత్య బెదిరింపులు.. కారును బాంబుతో పేల్చేస్తామంటూ..
Deportees | పనామా హోటల్లో నిర్బంధంలో భారతీయులు.. స్పందించిన ఎంబసీ