Rekha Gupta | ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా (Rekha Gupta) ఛార్జ్ తీసుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రమాణం చేసిన గంటల వ్యవధిలోనే ఆమె సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
#WATCH | Delhi CM Rekha Gupta formally assumes the office at the Secretariat as the 4th overall and 2nd woman BJP CM of Delhi pic.twitter.com/cfl6tYhsn6
— ANI (@ANI) February 20, 2025
ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి సీఎం రేఖా గుప్తా ఢిల్లీ సచివాలయానికి (Delhi Secretariat) చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సీఎం ఛాంబర్లోకి వెళ్లిన రేఖా గుప్తా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రిగా, రెండో మహిళా బీజేపీ సీఎంగా రికార్డు సృష్టించారు.
#WATCH | Delhi CM Rekha Gupta arrives at the Secretariat, where she will formally assume the office – 4th overall and 2nd woman BJP CM of Delhi pic.twitter.com/ZA9wIy578K
— ANI (@ANI) February 20, 2025
ఇక ఇవాళ సాయంత్రం 5 గంటలకు వాసుదేవ్ ఘాట్, యమునా బజార్‌ను సీఎం సందర్శించనున్నారు. సాయంత్రం 7 గంటలకు ఆమె తన మొదటి కేబినెట్ సమావేశాన్ని ఢిల్లీలోని సచివాలయంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు.
Delhi CM Rekha Gupta will commence her official duties with a series of key engagements.
At 3:00 PM, she will visit the Delhi Secretariat to formally assume office. Later in the day, at 5:00 PM, she will visit the Vasudev Ghat, Yamuna Bazaar. In the evening, at 7:00 PM, she will…
— ANI (@ANI) February 20, 2025
Also Read..
Rekha Gupta | ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం.. నాలుగో మహిళా సీఎంగా రికార్డు
Rekha Gupta: సీఎం రేఖా గుప్తా ఆస్తుల వివరాలు మీకు తెలుసా ?