మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 19:21:03

సిలబస్‌ తగ్గించిన ‘మహా’ సర్కారు

సిలబస్‌ తగ్గించిన ‘మహా’ సర్కారు

ముంబై : కరోనా మహమ్మారి మధ్య విద్యార్థులపై భారం పడకుండా ఒకటి నుంచి 12వ తరగతి వరకు 25శాతం సిలబస్‌ను తగ్గిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. పాఠ్య పుస్తకాల నుంచి ఏయే పాఠ్యాంశాలు తొలగించబడ్డాయనే వివరాలు మహారాష్ట్ర స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎంఎస్‌సీఈఆర్‌టీ) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని పాఠశాల విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్‌ పేర్కొన్నారు. పాఠశాలలు తిరిగి ప్రారంభించనందున విద్యార్థులపై భారాన్ని తగ్గించాలని ప్రభుత్వం కోరుకుంటుందని, 2020-21 విద్యా సంవత్సరానికి 25శాతం తగ్గిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.  పాఠశాలలు మూసివేయబడినప్పటికీ, విద్యా సంవత్సరం జూన్ 15 నుంచి ప్రారంభమైందని, వివిధ ప్రత్యామ్నాయ అభ్యాస పద్ధతులు అవలంభిస్తున్నాయని మంత్రి వివరించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


తాజావార్తలు


logo