నాసిక్ : బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాతలు పాదయాత్ర చేపట్టారు. డిమాండ్ల సాధన కోసం రైతన్నలు, కూలీలు నాసిక్ నుంచి ఆదివారం పాదయాత్రను ప్రారంభించారు. వీరు ముంబైలోని మహారాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు. భూ హక్కులు, సాగునీటి సదుపాయాలు, నిరంతరాయ విద్యుత్తు సరఫరా, సోయాబీన్‌కు కనీస మద్దతు ధర తదితర డిమాండ్లను నెరవేర్చాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని వీరు డిమాండ్ చేస్తున్నారు.
సీపీఎం, అఖిల భారతీయ కిసాన్ సభ నేతృత్వంలో వీరు పాదయాత్ర చేస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని, సచివాలయంలో ఘెరావ్ నిర్వహిస్తామని నేతలు హెచ్చరించారు.