Eknath Shinde | మహారాష్ట్ర ముఖ్యమంత్రి (Maharashtra CM ) పదవికి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) రాజీనామా ( resignation) చేశారు. ఇవాళ ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (Governor CP Radhakrishnan)ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. షిండే వెంట డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకూ షిండే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.
#WATCH | Maharashtra CM Eknath Shinde tenders his resignation as CM to Governor CP Radhakrishnan, at Raj Bhavan in Mumbai
Deputy CMs Ajit Pawar and Devendra Fadnavis are also present.
Mahayuti alliance consisting BJP, Shiv Sena and NCP emerged victorious in Maharashtra… pic.twitter.com/RGUl6chZOS
— ANI (@ANI) November 26, 2024
కాగా, ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ.. బీజేపీకి 132, శివసేనకు 57, ఎన్సీపీకి 41 స్థానాలు లభించాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతలు సిద్ధమయ్యారు. ఇక ప్రస్తుత అసెంబ్లీ గడువు నేటితో ముగియనుంది. ఇంతవరకూ సీఎం అభ్యర్థిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతలు ముఖ్యమంత్రి పదవిపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు.
అయితే, ఈ ఎన్నికల్లో అధిక సీట్లు సాధించిన బీజేపీనే సీఎం పదవి చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ లెక్కన ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీసే (Devendra Fadnavis) సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అజిత్ పవార్ కూడా ఫడ్నవీస్‌కే మద్దతు తెలిపినట్లు సమాచారం. అదే సమయంలో ఏక్నాథ్ షిండే (Eknath Shinde)ను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని శివసేన గట్టిగా పట్టుబడుతున్నది. దీంతో ఈ వ్యవహారం మహా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ రాత్రికి సీఎం అభ్యర్థిపై ఓ స్పష్టత రావడం ఖాయంగా తెలుస్తోంది.
Also Read..
Maharashtra | నేటితో ముగియనున్న అసెంబ్లీ గడువు.. ముఖ్యమంత్రి అభ్యర్థిపై కొనసాగుతున్న అనిశ్చితి
Samantha | నన్ను సెకండ్ హ్యాండ్ అన్నారు.. డివోర్స్ తర్వాత ఎన్నో ట్రోలింగ్స్‌ను ఎదుర్కొన్నా : సమంత
Islamabad | పీటీఐ కార్యకర్తల ఆందోళనలతో అట్టుడుకుతున్న పాక్.. ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది మృతి