Samantha | నాగచైతన్య (Naga Chaitanya)తో విడాకుల గురించి సమంత (Samantha) తాజాగా మరోసారి స్పందించారు. డివోర్స్ తర్వాత తనపై చాలా రూమర్స్ వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్నో ట్రోలింగ్స్‌ను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చారు (Trolling For Her Divorce). కొందరు తనను ‘సెకండ్ హ్యాండ్’ అని కామెంట్ చేశారని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత మాట్లాడుతూ.. ‘విడాకులు తీసుకుంటే దాన్ని జనం ఫెయిల్యూర్‌గా పరిగణిస్తారు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. పెళ్లైన నాలుగేళ్లకే చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నేను ఎన్నో తీవ్రమైన ట్రోలింగ్స్‌ను ఎదుర్కొన్నా. నన్ను కొందరు ‘సెకండ్ హ్యాండ్’ అని కామెంట్ చేశారు. నాపై చాలా రూమర్స్ వచ్చాయి. ఎన్నో అబద్ధాలు వ్యాప్తి చెందాయి. అవన్నీ నిజం కాదని చాలా సార్లు బయటకు వచ్చి చెప్పాలని అనిపించింది. కానీ చెప్పడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని ఆగిపోయాను’ అంటూ సామ్ చెప్పుకొచ్చింది.
Also Read..
Islamabad | పీటీఐ కార్యకర్తల ఆందోళనలతో అట్టుడుకుతున్న పాక్.. ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది మృతి
Maharashtra | నేటితో ముగియనున్న అసెంబ్లీ గడువు.. ముఖ్యమంత్రి అభ్యర్థిపై కొనసాగుతున్న అనిశ్చితి
Indian Constitution: రాజ్యాంగం 75వ వార్షికోత్సవం.. పార్లమెంట్లో ఇవాళ రాష్ట్రపతి ప్రసంగం