ముంబై: సంఘ సంస్కర్తలు మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేలకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ ఇవ్వాలని కోరుతూ మహారాష్ట్ర శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ మేరకు సోమవారం ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని ఆమోదించింది.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ, మన దేశంలో ‘మహాత్మా’ బిరుదు అన్నింటి కన్నా గొప్పదని చెప్పారు. ఇది కేవలం ఇద్దరు వ్యక్తులకు మాత్రమే ఉందన్నారు. ఒకరు మహాత్మా ఫూలే కాగా, మరొకరు మహాత్మా గాంధీ అని చెప్పారు. ‘భారత రత్న’ అనేది రాజ్యం ఇచ్చే గుర్తింపు, గౌరవమని పేర్కొన్నారు.