హైదరాబాద్: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) కౌంటింగ్ కొనసాగుతున్నది. అధికార బీజేపీ (BJP) కంటే కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతున్నది. ఇక సొరబ (Sorab) స్థానంలో మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప (Former CM S. Bangarappa) కుమారుల మధ్య పోటీ కొనసాగుతున్నది. అయితే ఇప్పటివరకు అన్న కుమార్ బంగారప్పపై (Kumar Bangarappa) తమ్ముడు మధు బంగారప్ప (Madhu Bangarappa) పైచేయి సాధించారు. కుమార్ బంగారప్ప బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా, మధు కాంగ్రెస్ (Congress) నుంచి బరిలో నిలిచారు. మధు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కాగా, కర్ణాటకలో కాంగ్రెస్ హవా కొనసాగుతున్నది. తాజా ట్రెండ్స్‌లో హస్తం పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. గ్రాండ్ ఓల్డ్‌పార్టీ 119 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 74, జేడీఎస్ 26, ఇతరులు 5 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక సీఎం బొమ్మై మంత్రివర్గంలోని 8 మంది మంత్రులు ప్రత్యర్థులకంటే వెనుకబడిపోయారు.
Karnataka Assembly Election Results 2023 | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్