కోచింగ్ సెంటర్లో మంటలు.. 15 మంది విద్యార్థుల దుర్మరణం
యూపీ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. కోచింగ్ సెంటర్, గేమింగ్ జోన్లు ఉన్న బిల్డింగ్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరుగడంతో 15 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు బిల్డింగ్ ఒకటో అంతస్తు నుంచి కిందకు దూకారు. తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
- బూడిదైన బతుకులు
- ఒకటో అంతస్తు నుంచి కిందికి దూకేసిన స్టూడెంట్స్
- భయపడి దూకలేక చిక్కుకుపోయిన పలువురు
- ఊపిరాడక, మంటలకు ఆహుతి
- యూపీలోని లక్నోలో దారుణం
లక్నో: యూపీ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. కోచింగ్ సెంటర్, గేమింగ్ జోన్లు ఉన్న బిల్డింగ్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరుగడంతో 15 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు బిల్డింగ్ ఒకటో అంతస్తు నుంచి కిందకు దూకారు. తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తున్నది. అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉషా మెహతా మార్గ్‌లోని కమర్షియల్ ఏరియాలో ఉన్న ఓ బిల్డింగ్‌లో గ్రౌండ్‌ఫ్లోర్‌లో పెంపుడు జంతువుల దుకాణంతో పాటు పై అంతస్తుల్లో కోచింగ్ సెంటర్, గేమింగ్ జోన్ ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో మొదట భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. అవి కాస్తా పై అంతస్తుల్లో ఉన్న కోచింగ్ సెంటర్‌కు ఎగబాకాయి. ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టేయడం, పెద్ద ఎత్తున పొగ వ్యాపించడంతో విద్యార్థులు తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
దూకేసిన విద్యార్థులు..
మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో తప్పించుకునేందుకు కొందరు విద్యార్థులు బిల్డింగ్ ఒకటో అంతస్తు నుంచి కిందికి దూకిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు ఏడు నుంచి ఎనిమిది మంది ఇలా దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ వారికీ గాయాలయ్యాయి. ఒక వ్యక్తి పగిలిన కిటికీలోంచి దూకుతున్న వీడియో వైరల్ అయింది. అతను నేరుగా కిందపడిపోగా.. స్థానికులు కాపాడారు. ఇంకొందరు దగ్గర్లోని తీగలను పట్టుకుని బయటపడే ప్రయత్నం చేస్తూ కింద పడిపోయారు. ఇలా కిందికి దూకిన విద్యార్థులను స్థానికులు వెంటనే దవాఖానలకు తరలించారు. కానీ దూకడానికి భయపడి చాలా మంది బిల్డింగ్‌లోనే చిక్కుకుపోయారని స్థానికులు చెబుతున్నారు.
తాము దూకమని చెప్పినా ఆగిపోయారని.. చివరకు మంటల్లో కాలిపోయారన్నారు. 14 ఫైర్ ఇంజిన్లు, ఒక హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్ మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగాయి. అగ్ని ప్రమాదం జరిగిన అరగంట తర్వాత ఫైర్ ఇంజిన్లు వచ్చాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందువల్లే ఎక్కువ ప్రాణనష్టం జరిగిందని చెబుతున్నారు. బిల్డింగ్ మొత్తం మంటలు వ్యాపించడంతో ఆ ఏరియా మొత్తం పొగతో నిండిపోయింది. ఈ ఘటనపై వైద్యాధికారి అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ.. 15 మంది చనిపోయారని, 22 మంది పిల్లలను హాస్పిటల్‌కు తరలించినట్టు తెలిపారు. కిందికి దూకిన విద్యార్థులకు చికిత్స అందిస్తున్నామని.. అందులో ఇద్దరికి వీపు భాగంలో గాయాలయ్యాయని వెల్లడించారు.
ప్రధాని సంతాపం..
ఘటనపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం అన్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డ వారికి రూ.50 వేల సాయం ప్రకటించారు. యూపీ సీఎం ఆదిత్యానాథ్ మాట్లాడుతూ ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

