Om Birla : లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి తనకు అవకాశం ఇచ్చిన లోక్‌సభ సభ్యులందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. స్పీకర్‌గా మళ్లీ తనను ఎన్నుకునేందుకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి కిరణ్ రిజిజులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని ఆయన వెల్లడించారు.
స్పీకర్‌గా ఎన్నికైన అనంతరం ఓం బిర్లా మాట్లాడుతూ తన పట్ల విశ్వాసం కనబరిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు. కాగా, లోక్‌సభ సభాపతిగా మరోసారి ఓంబిర్లా (Om Birla)నే గెలుపొందారు. బుధవారం జరిగిన ఓటింగ్‌లో ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేశ్‌పై ఓం బిర్లా గెలుపొందారు. మూజువాణీ ఓటుతో ఓంబిర్లా విజయం సాధించినట్లు ప్రొటెం స్పీకర్ బర్తృహరి మహతాబ్ ప్రకటించారు.
సభ ప్రారంభం కాగానే ఎన్డీయే కూటమి తరఫున లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా పేరును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదిస్తూ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్‌నాథ్ సింగ్ సహా మంత్రులు, ఎన్డీయే ఎంపీలు బలపరిచారు. మరోవైపు ఇండియా కూటమి తరఫున కె.సురేశ్ పేరును శివసేన (యుబిటి) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం చేశారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం స్పీకర్ పదవికి ఎన్నిక చేపట్టారు. మూజువాణీ ఓటుతో చేపట్టిన ఈ ఎన్నిక ప్రక్రియలో ఓం బిర్లా విజేతగా నిలిచారు.
Read More :
AP News | ప్రతిపక్ష హోదాపై స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ.. విరుచుకుపడ్డ ఏపీ మంత్రులు