న్యూఢిల్లీ: అణు రంగంలో ప్రైవేట్ సంస్థల ప్రవేశానికి ముందడుగుపడింది. దీనికి అనుమతించే ‘శాంతి’ బిల్లును (SHANTI Bill) లోక్సభ బుధవారం ఆమోదించింది. 2047 నాటికి దేశం 100 గిగా వాట్ల అణుశక్తి ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడంలో ఈ బిల్లు సహాయపడుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సభకు తెలిపారు. అయితే పౌర అణు రంగాన్ని ప్రైవేట్ భాగస్వామ్యం కోసం తెరవడానికి ప్రయత్నిస్తున్న సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా (శాంతి) బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. సభ నుంచి వాకౌట్ చేశాయి. అనంతరం వాయిస్ ఓటు ద్వారా ఈ బిల్లు లోక్సభ ఆమోదం పొందింది.
కాగా, దేశ అభివృద్ధి ప్రయాణానికి కొత్త దిశానిర్దేశం చేసే మైలురాయి చట్టమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అభివర్ణించారు. ‘భౌగోళిక రాజకీయాల్లో భారత దేశం పాత్ర పెరుగుతున్నది. మనం ప్రపంచవ్యాప్త భాగస్వామిగా ఉండాలంటే, ప్రపంచ ప్రమాణాలు, ప్రపంచ వ్యూహాలను మనం అనుసరించాలి. ప్రపంచం స్వచ్ఛమైన శక్తి వైపు పయనిస్తోంది. మనం కూడా 2047 నాటికి 100 గిగా వాట్ల అణుశక్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని అన్నారు.
మరోవైపు 2010 అణు ప్రమాద పౌర బాధ్యత చట్టం నిబంధనలను ఈ బిల్లు బలహీనపరిచినట్లు ప్రతిపక్షం ఆరోపించింది. అణు పరికరాల సరఫరాదారులను ప్రమాదాల బాధ్యత నుంచి ఈ బిల్లు తప్పించినట్లు విమర్శించింది.
Also Read:
Watch: బావిలో పడిన కుమార్తె.. కాపాడేందుకు అందులోకి దూకిన తండ్రి
Horses Run Across Busy Road | రద్దీ రోడ్డుపై గుర్రాల పరుగులు.. తర్వాత ఏం జరిగిందంటే?