Parliament Winter Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament Winter Session) సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోక్‌సభ (Lok Sabha) మధ్యాహ్నం వరకు వాయిదా పడింది. ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీల ఎంపీలు నిరసనకు దిగారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలు అంశాలను లేవనెత్తడంతో సభలో గందరగోళం నెలకొంది.
దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. సభ తిరిగి 12 గంటలకు సమావేశం కానుంది. ప్రస్తుతం రాజ్యసభ (Rajya Sabha) కొనసాగుతోంది. ఇక ఇవాళ మూడు కీలక బిల్లులు సభలో ఆమోదం పొందే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రైల్వే సవరణ బిల్లు, విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు, బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు ఈ రోజు ఉభయ సభల్లో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
Lok Sabha adjourned till noon soon after the House proceedings began for the day
Opposition MPs were raising different matters during Question Hour to which Speaker Om Birla objected and adjourned the House till noon. pic.twitter.com/AOZ4SDNxxc
— ANI (@ANI) December 9, 2024
Also Read..
Heavy Snow | హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా హిమపాతం.. మైనస్ డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
Bomb Threat | ఢిల్లీలో 40కిపైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. 30 వేల డాలర్లు ఇవ్వాలంటూ డిమాండ్
Bribe | ముడుపులు ముడితేనే పనులు.. దేశంలో పెచ్చరిల్లిన అవినీతి!