గురువారం 16 జూలై 2020
National - Jun 29, 2020 , 21:06:42

త‌మిళ‌నాడులోనూ లాక్‌డౌన్ పొడిగింపు

త‌మిళ‌నాడులోనూ లాక్‌డౌన్ పొడిగింపు

చెన్నై: క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం కేంద్ర ప్ర‌భుత్వం విధించిన నాలుగో విడ‌త లాక్‌డౌన్ గ‌డువు జూన్ 30 తో ముగియ‌నుంది. అయితే, లాక్‌డౌన్ ముగుస్తున్న క‌రోనా పాజిటివ్ కేసుల న‌మోదులో ఏమాత్రం త‌గ్గుద‌ల క‌నిపించ‌డంలేదు. దీంతో ప‌లు రాష్ట్రాలు మ‌రోసారి లాక్‌డౌన్ పొడిగింపున‌కు మొగ్గుచూపుతున్నాయి. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర స‌హా మ‌రికొన్ని రాష్ట్రాలు జూలై 31 వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. తాజాగా త‌మిళ‌నాడులో కూడా ఈ జాబితాలో చేరింది. 

త‌మిళ‌నాడులో కూడా జూలై 31 వ‌ర‌కు లాక్‌డౌన్‌ను పొడిగించ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే, రాష్ట్ర‌వ్యాప్తంగా జూలై 31 వ‌ర‌కు స‌డ‌లింపుల‌తో కూడిన లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చినా మ‌‌ధురై, గ్రేట‌ర్ చెన్నై పోలీస్ లిమిట్స్‌లో మాత్రం జూలై 5 వ‌ర‌కు కంప్లీట్ లాక్‌డౌన్ కొన‌సాగుతుంద‌ని తెలిపింది. గ్రేట‌ర్ చెన్నై ప‌రిధిలోని చెన్నై, కాంచిపురం, చెంగ‌ల్ప‌ట్టు, తిరువ‌ళ్లువార్ ఏరియాల్లో జూలై 5 వ‌ర‌కు క‌ఠినంగా లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంటుంద‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ అధికారులు తెలిపారు.   


logo