న్యూఢిల్లీ : విద్యా సంబంధమైన ఉపయోగానికి తప్ప.. రోగులను వాణిజ్యపరంగా దోచుకోవడానికి శస్త్ర చికిత్సల ప్రత్యక్ష ప్రసారాన్ని చేపట్టరాదంటూ ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. రోగి సమ్మతి, సంస్థాగత జవాబుదారీతనం, విద్యా విలువలు తప్పనిసరిగా పాటించాలంటూ తాజా గైడ్‌లైన్స్ పేర్కొన్నాయి.
శస్త్ర చికిత్సల ప్రత్యక్ష ప్రసారాన్ని నియంత్రిస్తూ ఎన్‌ఎంసీలోని ‘ఎథిక్స్, మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డ్’ సమగ్రమైన గైడ్‌లైన్స్‌ను రూపొందించింది. ప్రైవేట్ దవాఖానలు అనేక ఉల్లంఘనలకు పాల్పడుతూ శస్త్ర చికిత్సలను ప్రత్యక్ష ప్రసారం చేయటంపై సుప్రీంకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైంది. హెల్త్‌కేర్ కంపెనీల బ్రాండ్ ప్రమోషన్, వృత్తిపరమైన కీర్తి కోసం వీటిని చేపడుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది.