Lion | అడవిలో ఉండాల్సిన వన్య ప్రాణులు, క్రూర జంతువులు ఇటీవలే కాలంలో జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అటవీ సమీప ప్రాంతాల్లోని గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా గుజరాత్ (Gujarat) రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబానికి షాకింగ్ అనుభవం ఎదురైంది. వారి ఇంట్లోని కిచెన్‌లో సింహం (Lion) ప్రత్యక్షమైంది. దాన్ని చూసి కుటుంబసభ్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
ములుభాయ్ రాంభాయ్ లఖన్నోత్రా కుటుంబం బుధవారం రాత్రి తన ఇంట్లో నిద్రిస్తోంది. అయితే, అర్ధరాత్రి తర్వాత ఇంట్లో చప్పుడు వినిపించడంతో వారు లేచి చూడగా.. వంట గదిలోని గోడపై సింహం (Lion In kitchen) కనిపించింది. దీంతో వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. వారి కేకలకు ఇరుగుపొరుగు వారు లేచి అక్కడికి వచ్చారు. ఇంట్లోని సింహాన్ని చూసి షాక్ అయ్యారు. రెండు గంటల పాటూ ఆ సింహం వంట గదిలోనే దిష్ట వేసింది. స్థానికులు గట్టిగట్టిగా శబ్ధాలు చేస్తూ దాన్ని అక్కడి నుంచి తరిమి కొట్టారు. ఆ సింహం ఇంటిపైకప్పుపై ఉన్న రంధ్రం నుంచి ఇంట్లోకి ప్రవేశించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
जरा सोचिए,,, अगर आपके घर के अंदर शेर आ जाए तो क्या हाल हो
अमरेली में कुछ ऐसा ही हुआ…. जंगल का राजा शेर धूसा घर के अंदर 🦁
फीर क्या लोगो का हाल हुआ बेहला #Gujarat #Amreli #Lion pic.twitter.com/xkT9MQ6dNp
— Kamit Solanki (@KamitSolanki) April 2, 2025
Also Read..
Toxic Gas | మధ్యప్రదేశ్‌లో విషాదం.. బావిలో విషవాయువు పీల్చి ఎనిమిది మంది మృతి
Passengers | 40 గంటలుగా తుర్కియే ఎయిర్‌పోర్ట్‌లోనే.. వసతుల లేమితో భారతీయ ప్రయాణికుల అవస్థలు
Heart Attack | 25వ వివాహ వార్షికోత్సవం.. స్టేజ్‌పై భార్యతో డ్యాన్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన భర్త