Toxic Gas | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. బావి (well)లో విషవాయువు (toxic gas) పీల్చి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాండ్వా (Khandwa) జిల్లాలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.
చైగావ్ మఖాన్ ప్రాంతంలో గంగౌర్ పండుగ వేడుకల్లో భాగంగా విగ్రహాల నిమజ్జనం కోసం గ్రామస్థులు గురువారం బావిని సిద్ధం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఖాండ్వా కలెక్టర్ రిషవ్ గుప్తా తెలిపారు. బావిలో పేరుకుపోయిన బురదను తొలగించడానికి ముందుగా ఐదుగురు వ్యక్తులు బావిలోకి దిగారు. వారు అందులోని విష వాయువుల కారణంగా స్పృహ కోల్పోయి.. బురదలో మునిగిపోయారు. వారిని రక్షించేందుకు మరో ముగ్గురు బావిలోకి వెళ్లారు. కానీ విషవాయువు ప్రభావంతో వారు కూడా అందులోనే చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయినట్లు కలెక్టర్ వివరించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం, పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి ఎనిమిది మృతదేహాలను ఒక్కొక్కటిగా బావి నుంచి వెలికితీశారు. మృతులు రాకేశ్ పటేల్ (23), అనిల్ పటేల్ (25), అజయ్ పటేల్ (24), శరణ్ పటేల్ (35), వసుదేవ్ పటేల్ (40), గజనన్ పటేల్ (35), అర్జున్ పటేల్ (35), మోహన్ పటేల్ (53) గా గుర్తించారు.
Also Read..
Heart Attack | 25వ వివాహ వార్షికోత్సవం.. స్టేజ్‌పై భార్యతో డ్యాన్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన భర్త
Taj Mahal: టికెట్ సేల్స్ ద్వారా ఆదాయం.. టాప్‌లో తాజ్‌మహల్
Passengers | 40 గంటలుగా తుర్కియే ఎయిర్‌పోర్ట్‌లోనే.. వసతుల లేమితో భారతీయ ప్రయాణికుల అవస్థలు