Delhi Police | టీ20 వరల్డ్ కప్ కోసం 16 ఏండ్లు వేచిచూశాం.. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కొద్దిసేపు ఆగలేమా..
17 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్‌ను రెండోసారి గెలుపొందింది. బ్రిడ్జ్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆధ్యంతం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో భారత జట్టు విజయం సాధించింది. దీంతో టీ20 వరల్డ్‌కప్‌ను రెండు సార్లు సొంతం చేసుకున్న జట్ల జాబితాలో టీమ్ఇండియా నిలిచింది.
న్యూఢిల్లీ: 17 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్‌ను రెండోసారి గెలుపొందింది. బ్రిడ్జ్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆధ్యంతం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో భారత జట్టు విజయం సాధించింది. దీంతో టీ20 వరల్డ్‌కప్‌ను రెండు సార్లు సొంతం చేసుకున్న జట్ల జాబితాలో టీమ్ఇండియా నిలిచింది. భారత్‌కంటే ముందు ఇంగ్లండ్ (2010, 2022), వెస్టిండీస్ (2012, 2016) జట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు (Delhi Police) ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు..
‘మనమంతా భారత జట్టు మరో టీ20 వరల్డ్ కప్ గెలుపు కోసం 16 ఏండ్ల 9 నెలల 5 రోజులు (52 కోట్ల 70 లక్షల 40 వేల సెకన్లు) వేచిచూశాం. అదేవిధంగా ట్రాఫిక్ సిగల్స్ వద్ద కూడా ఓపికతో ఉందాం. మంచి క్షణాలు వేచి ఉండాల్సినవి. మరి మీరేమంటారు? టీమ్ఇండియాకు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
We all waited 16 years 9 months 5 days (52,70,40,000 seconds) for India to win another #T20WorldCup
Let’s be a little patient at traffic signals too. Good moments are worth the wait. What say?
Hearty congratulations, #TeamIndia💙 #INDvsSA#INDvSA
— Delhi Police (@DelhiPolice) June 29, 2024
The Dream Come True Number Plate!#UnStoppables#IndVsSA#WorldChampions pic.twitter.com/xMHfQjsnCc
— Mumbai Traffic Police (@MTPHereToHelp) June 29, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

