Leopard | అడవిలో ఉండాల్సిన వన్య ప్రాణులు, క్రూర జంతువులు ఇటీవలే కాలంలో జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అటవీ సమీప ప్రాంతాల్లోని గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్ (Gurugram)లో చిరుత (Leopard ) సంచారం కలకలం సృష్టించింది.
నర్సింగాపూర్ గ్రామంలోకి (Narsinghpur village) చొరబడిన చిరుత వేగంగా పరిగెత్తుకుంటూ ఓ అపార్ట్మెంట్ మెట్లెక్కి పైకి వెళ్లింది. కాసేపటికి తిరిగి కిందకు దిగింది. ఆ సమయంలో అక్కడున్న కొందరిపై దాడి చేసేందుకు యత్నించింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. చిరుత సంచారానికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరోవైపు చిరుత సంచార సమాచారం అందుకున్న అటవీ, పోలీసు అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వల సాయంతో చిరుతను బంధించే ప్రయత్నం చేస్తున్నారు.
#WATCH | Haryana: A leopard was spotted in Gurugram’s Narsinghpur village. The Forest Department team and Gurugram Police have arrived at the spot. pic.twitter.com/tSGg4U0srf
— ANI (@ANI) January 3, 2024
Also Read..
Zomato | పెట్రోల్ దొరకలేదు.. గుర్రంపై వెళ్లి ఫుడ్ డెలివరీ చేసిన వ్యక్తి.. VIDEO
Arvind Kejriwal | ఈడీ విచారణకు మరోసారి కేజ్రీవాల్ డుమ్మా
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి