Leopard | అడవిలో ఉండాల్సిన వన్య ప్రాణులు, క్రూర జంతువులు ఇటీవలే కాలంలో జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర (Maharashtra)లో చిరుత (Leopard) కలకలం రేపింది. థానే (Thane) జిల్లాలోని జనసాంద్రత ఎక్కువగా ఉన్న తూర్పు భయందర్ (Bahyandar) ప్రాంతంలోకి ప్రవేశించింది. శుక్రవారం ఉదయం ఓ భవనంలోకి ప్రవేశించి భయాందోళన సృష్టించింది. స్థానికులపై దాడి చేసింది. ఈ దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి.
🚨 Leopard attack in Mira Bhayandar this morning. 3 people injured as per the updates. Residents, stay safe 🙏 pic.twitter.com/mo61nAAfaK
— Mumbai Rains (@rushikesh_agre_) December 19, 2025
అప్రమత్తమైన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అనంతరం అతికష్టం మీద చిరుతను ఓ భవనంలో బంధించారు. ఇక ఘటనాస్థలికి చేరుకున్న అటవీ సిబ్బంది చిరుతను బోనులో బంధించి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఇక చిరుత దాడిలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిరుత సంచారానికి సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
#WATCH | Maharashtra | A leopard that entered a residential area in Mira Bhayandar early this morning and attacked two people has been captured. Further details awaited. pic.twitter.com/5FCA2uRVpn
— ANI (@ANI) December 19, 2025
A leopard entered the Parijat Building on BP Road in Bhayandar this morning. 4 people were injured in the attack. pic.twitter.com/NV4LwU2Zuj
— Suhas Birhade ↗️ (@Suhas_News) December 19, 2025
Also Read..
Om Birla | ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా.. హాజరైన ప్రధాని మోదీ, ప్రియాంక గాంధీ
HIV | తలసీమియా చికిత్సకోసం వెళ్తే హెచ్ఐవీ సోకింది.. రక్త మార్పిడితో ప్రమాదంలో చిన్నారుల జీవితాలు
Jammu Kashmir | చలి గుప్పిట్లో అందాల కశ్మీర్.. మైనస్ డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు