Jammu Kashmir | భూతల స్వర్గం జమ్ముకశ్మీర్ (Jammu And Kashmir) చలి గుప్పిట్లో చిక్కుకుంది. దీంతో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి (Temperatures Plummet). కొన్ని ఏరియాల్లో అయితే మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి. దాంతో అక్కడి సరస్సులు, కొలనుల్లోని నీరు గడ్డకట్టింది. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు.
జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీనగర్ (Srinagar)లో కనిష్ట ఉష్ణోగ్రతలు మైనస్ 2.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, శ్రీనగర్ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో మైనస్ 3.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. పుల్వామాలో మైనస్ 4.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ తర్వాత బారాముల్లాలో మైనస్ 3.6 డిగ్రీల సెల్సియస్, పాంపోర్, షోపియన్‌లో మైనస్ 3.5 డిగ్రీలు సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లోయలోని ఇతర ప్రాంతాల్లో కూడా గడ్డకట్టే పరిస్థితులు నెలకొన్నాయి.
కప్వారా, అనంత్‌నాగ్, బందిపోరాలో మైనస్ 2.8 డిగ్రీల సెల్సియస్, పహల్గామ్, అవంతిపోరాలో మైనస్ 2.6 డిగ్రీల సెల్సియస్, బుడ్గామ్‌లో మైనస్ 2.4 డిగ్రీల సెల్సియస్, ఖాజిగుండ్‌లో మైనస్ 1.8 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. గండేర్‌బాల్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు మైనస్ 0.5 డిగ్రీల సెల్సియస్, కోకర్నాగ్, కుల్గామ్‌లో వరుసగా 0.5 డిగ్రీల సెల్సియస్, 0.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతాలు గుల్మార్గ్, సోన్మార్గ్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 1.0 డిగ్రీల సెల్సియస్, 0.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.
ఉష్ణోగ్రతలు పడిపోవడంతో కశ్మీర్ వ్యాలీ (Kashmir Valley) అంతటా చలి తీవ్రత పెరిగింది. దీంతో వ్యాలీ వ్యాప్తంగా సరస్సులు, కొలనుల్లోని నీరు గడ్డకట్టింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పర్యాటక ప్రాంతమైన దాల్ సరస్సు (Dal Lake)లో చలి తీవ్రతకు నీరు గడ్డకట్టింది. ఈ చలికి సందర్శకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మొత్తంగా అందాల శ్రీనగర్ చలి గుప్పిట్లో వణుకుతోంది.
Also Read..
Air Pollution | తీవ్ర కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి.. 150 విమానాలు రద్దు
Bangladesh Protests | బయటకు రావొద్దు.. బంగ్లా అల్లర్ల నేపథ్యంలో భారతీయులకు కీలక అడ్వైజరీ
Dense Fog: పంజాబ్ టు బీహార్.. కమ్మేసిన పొగమంచు.. ఢిల్లీకి ఐఎండీ వార్నింగ్