న్యూఢిల్లీ: ఖైదీలకు అందించే న్యాయ సహాయం నామమాత్రపు తంతుగా మిగిలిపోకూడదని, అర్థవంతమైనదిగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది న్యాయవ్యవస్థ బాధ్యత అని పేర్కొంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును రద్దు చేసింది.
ఒక హత్య కేసులో జీవిత ఖైదు పడిన నందకిశోర్ మిశ్రా (74) దాఖలు చేసిన అప్పీల్‌ను ఎంపీ హైకోర్టు విచారించింది. మిశ్రా న్యాయ సహాయకుడ్ని సంప్రదించ కుండా హైకోర్టు తీర్పు ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.