Natwar Singh | ముగిసిన నట్వర్ సింగ్ అంత్యక్రియలు
Natwar Singh : అనారోగ్య సమస్యలతో పాటు వయోభారంతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విదేశాంగ మాజీ మంత్రి కే నట్వర్ సింగ్ (93) భౌతికకాయానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.
Natwar Singh : అనారోగ్య సమస్యలతో పాటు వయోభారంతో శనివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విదేశాంగ మాజీ మంత్రి కే నట్వర్ సింగ్ (93) భౌతికకాయానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఢిల్లీలోని లోధి స్మశాన వాటికలో జరిగిన దివంగత నేత అంత్యక్రియలకు పెద్దసంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు.
రాజస్ధాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహా పలువురు నేతలు హాజరయ్యారు.నట్వర్ సింగ్ చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు వారాల నుంచి గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నట్వర్ సింగ్ రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో 1931లో జన్మించారు.
నట్వర్ సింగ్ దౌత్యవేత్తగా జీవితాన్ని ప్రారంభించారు. దౌత్య రంగంలో సాధించిన అనుభవాన్ని రాజకీయ రంగానికి జోడించి సేవలందించారు. ఆయనకు 1984లో ‘పద్మభూషణ్’ పురస్కారం లభించింది. 2004-05 మధ్య కాలంలో యూపీఏ-1 ప్రభుత్వంలో ఆయన విదేశాంగ మంత్రిగా పని చేశారు. నట్వర్ సింగ్ మృతికి సంతాపం ప్రకటించిన పలువురు నేతలు ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
Thailand Queen: గ్రిపెన్ యుద్ధ విమానాన్ని నడిపిన థాయ్‌ల్యాండ్ క్వీన్… వీడియో
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

