హైదరాబాద్: చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఎవరూ స్థలాలు కొనుగోలు చేయవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Commissioner Ranganath) సూచించారు. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే హైడ్రా చర్యలు తప్పవని హెచ్చరించారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు కట్టాలంటే భయపడే స్థితికి తీసుకొస్తామన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు, కుంటలు అన్నీ కలిపి 400కుపైగా ఉన్నాయని చెప్పారు. నగరంలోని చెరువులను హైడ్రా ప్రధానంగా తీసుకుంటుందన్నారు. ఎన్ఆర్ఎస్సీ నివేదిక ప్రకారం 44 ఏండ్లలో చాలా చెరువులు కనుమరుగయ్యాయని వెల్లడించారు. చాలా చెరువులు 60 శాతం, కొన్ని 80 శాతం ఆక్రమణలకు గురయ్యాయని చెప్పారు.
చెరువుల పరిధిలోని ఆక్రమణలను గుర్తిస్తున్నామన్నారు. చెరువుల ఆక్రమణలను అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్ ప్రశ్నార్ధకమవుతుందన్ని తెలిపారు. త్వరలో హైడ్రాకు ప్రభుత్వం పెద్దఎత్తున సిబ్బందిని సమకూరుస్తుంద, ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా ఉంటుందన్నారు. 2500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పరిధి ఉందని తెలిపారు. ప్రజల నుంచి తమకు వందలాది ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు.
దశలవారీగా హైడ్రా పనిచేస్తుందన్నారు. మొదటి దశలో ఆక్రమణలను అడ్డుకోవడం హైడ్రా చేసే అని వివరించారు. రెండో దశలో ఆక్రమించి నిర్మించిన భవనాలపై చర్యలు, అనుమతుల నిరాకరణ ఉంటుందన్నారు. మూడో దశలో చెరువుల పూడిక తీసి వాననీటిని మళ్లించి పునర్జీవనం కల్పిస్తామన్నారు. గొలుసుకట్టు చెరువులన్నింటిని పునరుద్ధరిస్తామని చెప్పారు. చెరువులకు నీటిని మళ్లించే నాలాలు పూడుకుపోయాయని తెలిపారు. అవకాశవాదం వల్ల గొలుకట్టు చెరువులన్నీ మాయమయ్యాయని వెల్లడించారు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఎవరూ స్థలాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. చెరువుల పరిరక్షణకు అందరితో కలిసి మేథోమదనం చేస్తామన్నారు. పార్కు స్థలాలు పరిరక్షించే కాలనీ సంఘాలను సమర్థిస్తామన్నారు. పార్కు స్థలాల్లో ఫెన్సింగ్ వేసేందుకు కాలనీ సంఘాలకు సహకరిస్తున్నామని తెలిపారు. బస్తీ వాసులు మెరుగైన జీవన ప్రమాణాలు పెరగాలన్నారు.
నందగిరి హిల్స్ సొసైటీతో తమకు ఎలాంటి ఒప్పందం లేదన్నారు. చందానగర్లో గతేడాది బఫర్ జోన్లో నిర్మాణాలకు అనుమతులిచ్చారని తెలిపారు. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే హైడ్రా చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలు చూస్తారని వెల్లడించారు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు కట్టాలంటే భయపడే స్థితికి తీసుకొస్తామన్నారు. అక్రమంగా అనుమతులు ఇచ్చే అధికారులపై విచారణ చేసి ప్రభుత్వానికి వివరిస్తామన్నారు.