Ghaziabad Court | ఘజియాబాద్: యూపీలోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో జడ్జి, లాయర్ల మధ్య వాగ్యుద్ధం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బార్ అసోసియేషన్ అధికారికి సంబంధించిన ఒక కేసులో ఈ వివాదం జరిగింది. ఈ ఘటనలో కోర్టు రూములోని కుర్చీలను విసురుకున్నారు. పెద్ద యెత్తున వచ్చిన లాయర్లు.. జడ్జి చాంబర్‌ను చుట్టుముట్టడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రంగ ప్రవేశం చేసిన పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు. దీంతో విధులు బహిష్కరించిన న్యాయవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ జడ్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు ఆవరణలోని పోలీస్ ఔట్‌పోస్ట్‌ను చుట్టుముట్టారు. ఈ ఘటన తర్వాత న్యాయమూర్తి విధులను నిలిపివేశారు. బార్ అసోసియేషన్ నేతలను చర్చలకు పిలిచారు.