Landslides | రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక చోట్ల కొండచరియలు విరిగిపడటం (Landslides), ఆకస్మిక వరదలు (flash floods) సంభవిస్తున్నాయి. దీంతో వందలాది రోడ్లు బ్లాక్ అయ్యాయి. వెయ్యికి పైగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి.
తాజాగా హిమాచల్‌లో మరోసారి వర్షం బీభత్సం సృష్టించింది. కులు (Kullu) జిల్లాలో కురిసిన కుంభవృష్టికి భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. కులులోని అతుల్-లార్జీసోంజ్ మార్గంలో విరిగిన కొండచరియల కారణంగా దాదాపు 15 పంచాయతీలకు ఈ రోడ్డుతో సంబంధాలు తెగిపోయాయి. చండీగఢ్-మనాలీ జాతీయరహదారిపై చాలాచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. బజౌరా చెక్‌పోస్టు వద్ద పెద్దసంఖ్యలో ప్రయాణికుల వాహనాలు నిలిచిపోయాయి. కసోల్-కులూ మార్గాన్ని కూడా మూసివేశారు. ఆకస్మిక వరదలకు అనేక చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి.
VIDEO | Kullu: At least 15 panchayats cut off after a landslide near Pagal Nala on the Aut-Larji-Sainj road.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/pAv9qzDz4F
— Press Trust of India (@PTI_News) August 18, 2025
ఇక ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా మూడు జాతీయ రహదారులు సహా దాదాపు 355 రోడ్లు బ్లాక్ అయ్యాయి. మండి జిల్లా అత్యంత ప్రభావితమైంది. అక్కడ NH21 సహా 202 రోడ్లు మూతపడ్డాయి. ఆ తర్వాత కులులో NH305 సహా 64 రోడ్లు బ్లాక్ అయినట్లు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది. సిర్మౌర్ (28), కాంగ్రా (27), చంబా (9), సిమ్లా (8), ఉనా (7), లాహౌల్-స్పితి (6), కిన్నౌర్ (2, NH5 సహా), బిలాస్పూర్, హమీర్పూర్లలో ఒక్కొక్కటి చొప్పున ప్రభావితమయ్యాయి.
1,000కి పైగావిద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కులులో 557 ట్రాన్స్ఫార్మర్లు, మండిలో 385, లాహౌల్-స్పితిలో 112 పనిచేయడం లేదు. నీటి సరఫరా పథకాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. మండిలో 44, కులులో తొమ్మిది దెబ్బతిన్నాయి. జూన్ 20 నుంచి రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ప్రమాదాల వల్ల 261 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 136 మంది వర్షం కారణంగా సంభవించిన ప్రమాదాల్లో మరణించగా.. మిగతా 125 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు.
Also Read..
Missing | వరదలో కొట్టుకుపోయిన కారు.. మహారాష్ట్రలో జగిత్యాల వాసుల గల్లంతు
Morning Walk | షాకింగ్.. మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళల్ని ఢీ కొట్టిన రైలు
Rain Red Alert | రెయిన్ రెడ్ అలర్ట్.. బయటకు రావొద్దంటూ పోలీసులకు హెచ్చరికలు