Landslides | జమ్మూ కశ్మీర్‌లోని రియాసి (Reasi) జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి (Mata Vaishno Devi) వెళ్లే యాత్ర మార్గంలో కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఓ భక్తుడు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు గాయపడ్డారు.
పంచి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారీ బండరాళ్లు ఒక్కసారిగా కిందపడటంతో ఓవర్ హెడ్ ఐరన్ స్ట్రక్చర్ దెబ్బతిన్నది. సమాచారం అందుకున్న వైష్ణోదేవి ఆలయ బోర్డుకు చెందిన డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాదంలో గాయపడిన యాత్రికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన నేపథ్యంలో ఆ మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్ర సమయంలో యాత్రికులు జాగ్రత్తగా ఉండాలని, పరిస్థితులను అంచనా వేస్తూ ముందుకు సాగాలని సూచించారు.
Also Read..
Kangana Ranaut | నా సినిమాపై ‘ఎమర్జెన్సీ’ విధించారు.. సినిమా విడుదలలో జాప్యంపై కంగన
Karachi Mall | ఓపెనింగ్ డే సందర్భంగా భారీ డిస్కౌంట్స్.. కరాచీ మాల్‌ను లూటీ చేసిన జనం.. వీడియోలు
Dinesh Karthik | పుజారా, రహానేల స్థానంలో ఆ ఇద్దరు.. ఎందుకంటే..?