Karachi Mall | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan)లో కొత్తగా ఓపెన్ అయిన ఓ షాపింగ్ మాల్‌ను (Karachi Mall) ప్రజలు లూటీ చేశారు. వేల సంఖ్యలో ప్రజలు మాల్‌పై మూక దాడి చేసి.. ధ్వంసం చేశారు. అందులోని వస్తువులను చేతికందిన కాటికి దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
పాకిస్థాన్‌లోని ఓ బడా బిజినెస్మెన్ కరాచీలోని గులిస్తాన్-ఎ-జోహార్ ప్రాంతంలో డ్రీమ్ బజార్ (Dream Bazaar Mall) పేరుతో ఓ పెద్ద షాపింగ్ మాల్‌ను స్థాపించారు. ఈ మాల్‌ను ఈ నెల 1వ తేదీన గ్రాండ్‌గా ఓపెన్ చేశారు. ఇక ఓపెనింగ్ సందర్భంగా భారీ డిస్కౌంట్లను ప్రకటించారు. దీంతో ఊహించిన దానికంటే ఎక్కువగానే ప్రజల నుంచి స్పందన వచ్చింది. అయితే, అదే ఆయన కొంప ముంచింది. ఓపెనింగ్ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాల్ తలుపులు తెరవగానే.. వేలాది మంది ప్రజలు అందులోకి దూసుకెళ్లారు. ఆఫర్స్ కోసం ఎగబడ్డారు.
ఆ జనాన్ని చూసి యాజమాన్యం ఒక్కసారిగా కంగుతింది. రద్దీని కట్టడి చేసేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో ఏం చేయాలో అర్థంకాక చేతులెత్తేసింది. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. గుంపులు గుంపులుగా లోపలికి వచ్చి జనం చేతికందిన కాటికి దోచుకెళ్లారు (mob loots mall). బిల్లు లేదు, ఏమీ లేదు. ఎవరికి నచ్చింది వాళ్లు సంచుల్లోకి వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడితో ఆగని జనం.. ఆస్తులను కూడా ధ్వంసం చేసి వెళ్లారు.
ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు.. ‘డ్రీమ్ బజార్’ వ్యాపారవేత్తకు చేదు జ్ఞాపకాల్ని మిగిల్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రారంభ రోజున మాల్లో ప్రజలు కలిగించిన అంతరాయంపై సిబ్బంది ఒకరు తన నిరాశను వ్యక్తం చేశారు. ‘మాల్ పరిస్థితి చూడండి. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా దీన్ని అందుబాటులోకి తెచ్చాము. కానీ, ప్రజలు దాన్ని అర్థం చేసుకోకుండా దాడి చేశారు’ అని వాపోయారు.
A businessman of Pakistan living abroad opened a huge mall in locality of Karachi, which he named Dream Bazaar. And today on day of inauguration he had announced a special discount Crowd of about one lakh stormed and looted the entire mall
pic.twitter.com/DlNcxm2wzO— Ghar Ke Kalesh (@gharkekalesh) September 1, 2024
Also Read..
Kangana Ranaut | నా సినిమాపై ‘ఎమర్జెన్సీ’ విధించారు.. సినిమా విడుదలలో జాప్యంపై కంగన
TV channels | బెంగాల్‌పై వ్యతిరేక ప్రచారం.. మూడు టీవీ ఛానెళ్లపై దీదీ ప్రభుత్వం నిషేధం
Samantha | పని విషయంలో లింగ వివక్షత ఉండకూడదు.. చిత్ర పరిశ్రమలో మార్పు అవసరం : సమంత