TV channels | కోల్‌కతాలోని ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఆర్జీ కార్ మెడికల్ వైద్య కళాశాలలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన కుదిపేస్తోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయంలో బెంగాల్‌లోని (West Bengal) తృణమూల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు టీవీ ఛానెళ్లపై (TV channels) బహిష్కరణ వేటు వేసింది.
వైద్య విద్యార్థిని హత్యాచారంపై తప్పుడు వార్తలు ప్రసారం చేయడం సహా బెంగాల్‌పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు ఏబీపీ ఆనంద (ABP Ananda), రిపబ్లిక్ (Republic), టీవీ9 (TV9).. ఈ మూడు ఛానెళ్లను బహిష్కరించింది. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఆయా టీవీ ఛానెళ్లు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని వ్యాఖ్యానించింది. టీవీ ప్రమోటర్లు ఈడీ, సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు ఢిల్లీలోని జమిందారులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించింది. వారి ఒత్తిడిని మేము అర్థం చేసుకున్నామంటూ ఎద్దేవా చేసింది.
Statement in connection with the recent media developments pic.twitter.com/e5qvjd4oBm
— All India Trinamool Congress (@AITCofficial) September 1, 2024
Also Read..
Terror Attack | మిలిటరీ స్థావరంపై ఉగ్రవాదుల దాడి.. జవానుకు గాయాలు
Pawan Kalyan | పవన్ కల్యాణ్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన అల్లు అర్జున్
Samantha | పని విషయంలో లింగ వివక్షత ఉండకూడదు.. చిత్ర పరిశ్రమలో మార్పు అవసరం : సమంత