Samantha | మలయాళ సినీరంగంలో (Malayalam cinema) మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదిక (Hema commission report) అక్కడి ఇండస్ట్రీని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ నివేదికను ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటీనటులు స్వాగతిస్తూ.. హేమ కమిటీని అభినందిస్తున్నారు. ఇక ఈ కమిటీ నివేదకను ఇప్పటికే స్వాగతించిన టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha).. తాజాగా మరోసారి స్పందించారు. పని విషయంలో లింగ వివక్షత ఉండకూడదని పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో మార్పు అవసరమని.. వర్క్‌ప్లేస్‌ను పునరుద్ధరించుకుందామంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్ట్ పెట్టారు.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత చిత్ర పరిశ్రమలోని మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి, తమ చేదు అనుభవాల గురించి చెబుతున్నారని సామ్ తెలిపారు. పని ప్రదేశాల్లో ఏ రూపంలో లింగవివక్ష చూపినా అది లైంగిక వేధింపుల మాదిరిగానే ఉంటుందని హేమ కమిటీ పేర్కొన్నట్లు చెప్పారు. లింగ అసమానతను అరికట్టేందుకు పారదర్శకమైన వ్యవస్థను నివేదిక సిఫార్సు చేసిందని తెలిపారు. లింగ వివక్ష లేని వాతావరణాన్ని ఇండస్ర్టీలో కల్పించేందుకు ప్రభుత్వం, మూవీ ఆర్గనైజేషన్లు కలిసి ముందుకు నడవాల్సిన సమయం ఇది అని సామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాగా, హేమ కమిటీ రిపోర్ట్‌పై సామ్ ఇప్పటికే రెండుసార్లు స్పందించిన విషయం తెలిసిందే. హేమ కమిటీ రిపోర్ట్‌ను స్వాగతించారు. చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల సమస్యను తెరపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కేరళలోని విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యుసీసీ) ప్రయత్నాలను ప్రశంసించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Govt) సామ్ కీలక విజ్ఞప్తి చేశారు. డబ్ల్యూసీసీని స్ఫూర్తిగా తీసుకొని.. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ 2019లో ‘ది వాయిస్ ఆఫ్ విమెన్’ ఏర్పాటైందని గుర్తు చేశారు. టాలీవుడ్లో మహిళల సమస్యలపై పోరాడేందుకు రూపొందించిన ఈ సబ్ కమిటీ నివేదికను పబ్లిష్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
Also Read..
ED | ఆప్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు.. అరెస్ట్ చేసేందుకు వచ్చారంటూ పోస్ట్
Sexual Assault | బీజేపీ నేతపై లైంగిక వేధింపుల కేసు
TGSRTC | భారీ వర్షాల ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణ మధ్య 560 బస్సులు రద్దు చేసిన టీజీఎస్ఆర్టీసీ