Rahul Mamkootathil : అత్యాచారం కేసులో బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA) రాహుల్ మామ్కుటాతిల్ (Rahul Mamkootathil) అరెస్టయ్యాడు. కేరళ క్రైమ్ బ్రాంచ్ (Kerala Crime branch) పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పాలక్కడ్ ఎమ్మెల్యే (Palakkad MLA) రాహుల్‌పై కొత్తగా మరో ఫిర్యాదు అందడంతో అతడిని అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి పాలక్కడ్‌లోని ఓ హోటల్ నుంచి అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం విచారణ నిమిత్తం పథనంతిట్టలోని ఏఆర్ క్యాంప్‌కు తరలించారు. విచారణ అనంతరం అతడిని తిరువళ్ల జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చనున్నారు. రాహుల్ డిసెంబర్ ప్రారంభంలో తనపై తొలి అత్యాచారం కేసు నమోదుకాగానే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కేరళ హైకోర్టు అతడి అరెస్ట్‌పై స్టే విధించింది.
కేసును ఏపీపీ నుంచి కేరళ క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీచేశారు. ఇప్పుడు అతడిపై మరో కేసు నమోదవడంతో అరెస్ట్‌చేశారు.