Pawan Kalyan | పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా పవన్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు డిప్యూటీ సీఎంకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా డిప్యూటీ సీఎంకు ప్రత్యేకంగా విషెస్ తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్‌డే పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు’ అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
Many happy returns of the day to Power Star & DCM @PawanKalyan garu
— Allu Arjun (@alluarjun) September 2, 2024
కాగా, గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్, మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా కోల్ట్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌కు కాకుండా వైసీపీ అభ్యర్థికి బన్ని మద్దతు ఇచ్చారు. దీంతో మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. అల్లు అర్జున్ను నెట్టింట మెగా ఫ్యాన్స్ తెగ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో మెగా, అల్లు కుటుంబాల మధ్య కూడా దూరం పెరుగుతోందంటూ చర్చ నడిచింది. ఈ వివాదం నడుమ డిప్యూటీ సీఎంకి బన్ని విష్ చేయడం ఆసక్తిగా మారింది.
Also Read..
Samantha | పని విషయంలో లింగ వివక్షత ఉండకూడదు.. చిత్ర పరిశ్రమలో మార్పు అవసరం : సమంత
Pawan Kalyan Birthday | తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి
KTR | ముఖ్యమంత్రి గారు.. నా మీద కోపంతో నేతన్నల ప్రాణాలు బలిపెట్టొద్దు: కేటీఆర్